![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ సీజన్-8 పన్నెండు వారాల నుండి రసవత్తరంగా సాగుతుంది. ఆయితే లోపల కంటెస్టెంట్స్ పర్ఫామెన్స్ ఎలా ఉన్నా వారి ఆటతీరుని చెప్పే రివ్యూయర్స్ చాలామందే ఉన్నారు. వారిలో ఆదిరెడ్డి ఒకడు. తన రివ్యూస్‌తో పాపులర్ అయిన సీజన్-6 కంటెస్టెంట్ ఆదిరెడ్డి. ఈ మధ్య అతనికి వరుస బెదిరింపులు వస్తున్నాయంట. నబీల్ ఆఫ్రిది ఫ్యాన్స్ అయితే ఆదిరెడ్డిని తగలబెట్టేస్తాం అంటూ సోషల్ మీడియా వేదికగా బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. నిజానికి అసలు నబీల్‌ని జెన్యూన్ పర్సన్ అంటు ఆదిరెడ్డి చెప్పాడు.
గత వారం రోజులుగా నబీల్‌లో జెన్యునిటీ పక్కకిపోయి.. కుళ్ళు కుతంత్రాలు బయటకొచ్చాయి. దీంతో ఆదిరెడ్డి అతని తప్పుల్ని ఎత్తి చూపుతూ రివ్యూలు చేయడంతో.. నబీల్ అఫ్రిది ఫ్యాన్స్ హర్ట్ అయిపోతున్నారు. అయితే అయ్యారులే.. ఇలాంటి హర్టింగ్‌లు బిగ్ బాస్ రివ్యూస్ వల్ల కామనే కానీ.. మరీ ఇలా చంపేస్తాం.. తగలబెట్టేస్తాం లాంటి హెచ్చరికలు ఉన్మాదం కిందకే వస్తాయి. మెహబూబ్ హౌస్‌లో ఉన్నప్పుడు.. మైనారిటీ ఓట్లు గురించి నోరు జారాడు. మనకి ముస్లిం ఓట్లు పడతాయనే ఉద్దేశంలో మాట్లాడటంతో అది వివాదం అయ్యింది. దాన్ని కూడా తప్పు పడుతూ ఆదిరెడ్డి రివ్యూ చేశాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న షఫీ అనే నబీల్ ఫ్యాన్.. బిగ్ బాస్ సీజన్-8 అవ్వగానే.. ఆ ఆదిరెడ్డి గాడ్ని కాలబెట్టాల్రా అంటూ కామెంట్ పెట్టాడు. దీన్ని బట్టి అతనిలో ఎంత పైశాచికత్వం ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే బిగ్ బాస్ రివ్యూస్ చెప్పేవాళ్లకి ఇలాంటి బెదిరింపులు.. హెచ్చరికలు కామనే. ముఖ్యంగా ఆదిరెడ్డికి అయితే మరీ ఎక్కువ. ఎందుకంటే.. అతని రివ్యూలకు ఎక్కువ వ్యూవర్ షిప్ ఉండటంతో.. అతని వల్ల కూడా ఓట్లు ప్రభావితం అవుతాయని ఉద్దేశంలో అతను ఎవర్ని పొగిడినా తిట్టినా వివాదాస్పదం అవుతుంటాయి.
గతవారం జరిగిన మెగా ఛీఫ్ టాస్క్ లో పృథ్వీకి సపోర్ట్ చేసిన నబీల్.. రోహిణి గెలవడాన్ని తీసుకోలేకపోయాడు. గేమ్ లో రోహిణి కుండని కిందపడేయానికి ఇసుకని ఫోర్స్ గా పోశాడు. తను కాలు సరిగ్గా పెట్టలేదంటూ పృథ్వీతో చెప్పుకొచ్చాడు నబీల్. గౌతమ్ ని కన్నడ బ్యాచ్ టార్గెట్ చేస్తూ నామినేషన్లు చేయడం వారికి సపోర్ట్ గా నబీల్ ఉండటంతో అతని గేమ్ కిందకి పడిపోతుంది. దాంతో గౌతమ్ ఒక్కసారిగా విన్నర్ రేసులోకి వచ్చాడు. అయితే ఉన్నది ఉన్నట్టు చెప్పే ఆదిరెడ్డిని నబీల్ ఫ్యాన్స్ ఇలా తిట్టడం చాలా దారుణమంటూ కొందరు విమర్శిస్తున్నారు.
![]() |
![]() |